
హైదరాబాద్: శ్రీరామచంద్ర విజయోత్సవ యాత్ర కూకట్ పల్లిలో ఘనంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరగనున్న రథ యాత్రను తెలంగాణవ్యాప్తంగా నిర్వహించనున్నారు.ఈ విజయోత్సవ యాత్రలో అన్ లిమిటెడ్ ప్రసాదాలు, శ్రీరామ చంద్ర గురించిన పుస్తకాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
విజయోత్సవ యాత్రను స్వామివారి పూజతో మొదలు పెట్టారు. రామరాజ్యం రావాలంటే భగవంతుని ఆశీర్వాదాలు కావాలి..భగవంతుని ఆశీస్సుల కోసం జయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.
శ్రీరామ నామాన్ని అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో ఇస్కాన్ ఆచార్యుల ఆధ్వర్యంలో విజయోత్సవ రథయాత్ర చేపట్టామన్నారు. 45 రోజులపాటు వెళ్లినచోటల్లా కీర్తనలు, సంప్రదాయ నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. యాత్ర ప్రారంభం సందర్భంగా పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.