NTRNeel: పాపం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఊరించి ఉసూరుమనిపించిన మైత్రీ మూవీ మేకర్స్ !

NTRNeel: పాపం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఊరించి ఉసూరుమనిపించిన మైత్రీ మూవీ మేకర్స్ !

జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా (MAY20) తారక్ కొత్త సినిమాల అప్డేట్స్పై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అందులో ఎన్టీఆర్-నీల్ మూవీ, బాలీవుడ్ మూవీ వార్ 2, దేవర 2 సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే, వార్ 2 నుంచి అప్డేట్ వస్తోన్న విషయం హృతిక్ కన్ఫార్మ్ చేశాడు. ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి కూడా క్రేజ్ అప్డేట్ వస్తోందని అంత భావించారు. కానీ, లేటెస్ట్గా ఎలాంటి అప్డేట్ రావట్లేదని మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను డిస్సప్పాయింట్ చేశారు.

అయితే, భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి అప్డేట్ రావట్లేదని పోస్టులో వెల్లడించారు. 'యుద్ధాన్ని గౌరవిస్తూ... నీల్ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ అందించలేకపోతున్నాం. మన మాస్ మిస్సైల్‌ను ప్రారంభించడానికి సరైన సమయంలో మేము నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. ప్రస్తుతానికి ఎన్టీఆర్ పుట్టినరోజును వార్ 2తో జరుపుకోండి' అంటూ పోస్టు ద్వారా మైత్రి మేకర్స్ తెలిపారు. 

ఇటీవలే NTR 31(డ్రాగన్) రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా (మే 20న) గ్లింప్స్ రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఆగమనం చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. ఇంతలోనే బ్యాడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా ఫ్యాన్స్ ను ఊరించి మరి ఉసూరుమనిపించారు మైత్రీ మేకర్స్!

ఎందుకంటే, ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన పోస్టర్ కూడా ఒకటి తప్పితే, పెద్దగా వచ్చిందేం లేదు. జస్ట్ పూజా కార్యక్రమాలు, నీల్, ఎన్టీఆర్ కలిసిన ఫొటోలే కనిపిస్తున్నాయి. అలా ఎన్టీఆర్ ఆఫీసియల్ పోస్టర్ వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ బర్త్ డే పై ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక అవి నీరుకారాయి.ఈ మూవీ వచ్చే ఏడాది 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.