
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 27వ తేదీ సోమవారం గరుడాదివాసం కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక జీయర్ మఠంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో గరుఢ పటానికి పూజలు నిర్వహించి గరుడా దివాసము నిర్వహించారు.
జీయర్ మఠం నుంచి ఆలయం వరకు గరుడ పటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతారాములకు సువర్ణ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. మార్చి 28వ తేదీ బ్రహ్మోత్సవాలకు అగ్ని మథనం దేవత ఆహ్వానం, బేరి పూజ, గరుడ పట ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.