
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్భర్పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మిబాయి రాజేశ్వరావు దంపతుల కుమారుడు ప్రవీణ్‌రావు(42) కెనడాలో అనారోగ్యంతో బుధవారం మరణించారు. ప్రవీణ్ రావు పదో తరగతి వరకు దుబ్బాక మండలం ఆకారం గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో చదివారు.
ఇంటర్ సిద్దిపేటలో చేసి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చేశారు. ప్రవీణ్ కొన్నేళ్ల కింద ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. అక్కడే ఉద్యోగం సంపాదించి భార్య, ఇద్దరు పిల్లలతో స్థిరపడ్డారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.