
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆర్సీబీ.. ఐసీఎల్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్ లలో ముఖ్యమైన టీమ్. IPL-2025 సీజన్ లో అన్ని విభాగాల్లో రాణిస్తూ ఫ్యాన్స్ లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్న జట్టు. ఎంతో విలువైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మొదటి నుంచి అద్భుతమైన ఆటతో పోరాడుతూ చివర్లో ఢీలా పడే ఈ జట్టు.. ఈసారి కప్ కొట్టేలా ఉంది.. అని అపోనెంట్ టీమ్ ఫ్యాన్స్ కూడా అనుకునేలా ఈ సారి కంబ్ బ్యాక్ ఇచ్చింది.
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అదరగొడుతూ దూసుకుపోతున్న ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ముందు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి వైదొలగనున్నాడు.
మంచి ఫామ్ లో ఉండి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పడిక్కల్ గాయం కారణంగా దూరం కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి. తొడ పైభాగంలో గాయం కారణంగా పడిక్కల్ మిగిలిన టౌర్నమెంట్ కు దూరం కానున్నాడు.
అయితే పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను స్క్వేడ్ లోకి తీసుకుంటున్నట్లు ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రకటించింది. టాటా ఐపీఎల్-2025లో ఒక కోటి రూపాయల బేస్ ప్రైజ్ తో ఉన్న మయాంక్ అగర్వాల్ ను ఏ జట్టు తీసుకోలేదు. తాజాగా పడిక్కల్ స్థానంలో జట్టులోకి తీసుకుంటున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది.
దేవదత్ పడిక్కల్ ఆర్సీబీకి ఇప్పటి వరకు పది మ్యాచ్ లు ఆడాడు. రెండు అర్థ సెంచరీలతో 247 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 127 మ్యాచ్ లు ఆడిన మయాంక్ అగర్వాల్.. 2661 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కీలక సమయంలో గాయాల బెడద:
ఆర్సీబీ మొదటి నుంచి అద్భుత ఫామ్ లో దూసుకుపోతోంది. అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ ప్లేయింగ్ గా రాణిస్తూ టాప్ 3 లో కొనసాగుతోంది. ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉన్న బెంగళూర్ కు కీలక సమయంలో ప్లేయర్ల గాయాల బెడద ఇబ్బందికి గురి చేస్తోంది. ఇప్పటికే పవర్ హిట్టర్ పిల్ సాల్ట్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్నాడు.
వీరిద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. వీరిద్దరికి తోడు ఆ జట్టు కెప్టెన్ పటిదార్ చేతి వేలి గాయం ఆర్సీబీని మరింత కలవరానికి గురి చేస్తోంది. ఇది చాలదన్నట్లు పడిక్కల్ గాయం కారణంగా సీజన్ మొత్తానికే వైదొలగడం ఆందోళన కలిగించే అంశం.
►ALSO READ | KKR vs CSK: రస్సెల్, రహానే మెరుపులు.. చెన్నై ముందు ఛాలెంజింగ్ టార్గెట్!
ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ వేలికి గాయం అయింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను తన చేతికి బ్యాండేజ్‌తో కనిపించాడు. రవీంద్ర జడేజా కొట్టిన బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు పాటిదార్ గాయపడ్డాడు. 31 ఏళ్ల ఆర్సీబీ కెప్టెన్ శుక్రవారం (మే 9) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగబోయే మ్యాచ్ కు దూరం కానున్నట్టు సమాచారం. గాయం పెద్దది కాకపోవడంతో పటిదార్ మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండనుండడం ఆర్సీబికి ఊరటనిచ్చే విషయం.
ఈ సీజన్ లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న పటిదార్ సేనతర్వాత జరగబోయే మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే టాప్-2 లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ లో శుక్రవారం (మే 9) లక్నో సూపర్ జెయింట్స్‌తో.. మే 13 న సన్ రైజర్స్ తో .. మే 17న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.