ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ గా శ్రీ విష్ణు సినిమా

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ గా శ్రీ విష్ణు సినిమా

కొత్త తరహా కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చే శ్రీవిష్ణు.. ఇప్పుడు ‘సామజవరగమన’ అనే టైటిల్‌‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ చేస్తున్నాడు.  ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దీనికి దర్శకుడు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌‌. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌‌కి మంచి రెస్పాన్స్‌‌ వచ్చింది. తాజాగా ‘వాట్ టు డూ’ అంటూ సాగే  ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘ఏం బోర్ కొట్టిందో..బీరే ఒకటి తగ్గిందో.. తిక్క రాత రాశాడు ఆ బ్రహ్మా.. నావైపు చూశాడు ఏదో టైపు చేశాడు.. తారుమారు చేశాడు.

అయ్యాయో అయ్యాయో వాట్ టు డూ’ అంటూ  శ్రీవిష్ణు తనలోని ఫ్రస్ట్రేషన్ ని చెబుతూ సాగిందీ పాట. గోపీ సుందర్ కంపోజ్ చేయగా, శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాశాడు. జెస్పీ గిఫ్ట్ ఎనర్జీతో పాడాడు. నరేష్​, సుదర్శన్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మే 18న సినిమా రిలీజ్ కానుంది.