రేప‌ట్నుంచే శ్రీకృష్ణ సీరియ‌ల్

రేప‌ట్నుంచే శ్రీకృష్ణ సీరియ‌ల్

శ్రీకృష్ణ సీరియ‌ల్ ను పునఃప్రసారం చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే దూర‌ద‌ర్శ‌న్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యంపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ప్రేక్ష‌కాధ‌ర‌ణ పొందిన ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియ‌ల్ డీడీ ఛానెల్ లో ఆదివారం(మే- 03) నుంచే ప్ర‌సారం కానుంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న‌ద‌ని తెలిపారు. రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్ ‌లో ప్రసారమైన విష‌యం తెలిసిందే.

లాక్ డౌన్ వేళ ఇప్ప‌టికే దూర‌ద‌ర్శ‌న్ ‌లో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ రిపీట్ అవుతుండ‌గా .. ఇప్పుడు శ్రీకృష్ణ కూడా పునఃప్రసారం అవుతుండ‌టంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు. రామాయణం, మహాభారతం పున:ప్రసారం చేస్తోన్న క్ర‌మంలో డీడీ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోయింది. స‌రికొత్త రేటింగ్స్ ‌తో ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది. రామాయ‌ణం సీరియ‌ల్ అయితే వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించిన విష‌యం తెలిసిందే.