శ్రీనందు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కాసు’. ఇందుకుమార్ హీరోయిన్. పి.ఎస్. హర్షవర్థన్ దర్శకత్వంలో ఇందుకుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు నిర్మాత ఏఎం రత్నం అతిథిగా హాజరై సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నందు ‘జై’ పాత్రలో కనిపించనున్నాడు.
దురాశ మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నామని హీరో నందు చెప్పాడు. ఈ సినిమా సైకలాజికల్‌గా ఆలోచింపజేస్తూనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శకుడు హర్షవర్ధన్ చెప్పాడు. డబ్బుపై దురాశ, ప్రేమ, మానవ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీనే ఈ చిత్రమని నిర్మాత నరేంద్ర కొండ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటర్ శ్రీనివాస్ ఈ సినిమా తమకు ప్రత్యేకమైనదని తెలియజేశారు.
