శ్రీనిధి శెట్టి .. టాలీవుడ్ ఎంట్రీ

శ్రీనిధి శెట్టి .. టాలీవుడ్ ఎంట్రీ

కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాతో క్రేజ్ అందుకున్న కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఆ తర్వాత ‘కోబ్రా’ అనే సినిమాతో కోలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.  ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.  సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా ఓ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా,  మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీనిధి నటిస్తోంది.  ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. 

ఇటీవల షూట్ మొదలైంది.  ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు ఓ పాటను చిత్రీకరించారు.  తాజాగా కొత్త షెడ్యూల్ మొదలైంది.  శ్రీనిధి శెట్టి ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయింది.  ఆమెపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ స్టోరీలో బ్యూటిఫుల్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న శ్రీనిధికి గ్రేట్ సక్సెస్ రావాలంటూ షూటింగ్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసిన ఫొటోను ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  .