ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

ముగిసిన శ్రీనివాస్ అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లా : BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ప్రాణత్యాగం చేసిన కార్యకర్త శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడంలో… పోలీసులు భారీ బందోబస్తు మధ్య  అంత్యక్రియలు జరిగాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, మాజీఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు.. పార్టీ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి అంతమ యాత్రలో పాల్గొన్నారు నేతలు.

బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ నవంబర్ ఒకటిన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్. ముందు ఉస్మానియాలో చేరిన శ్రీనివాస్ ను.. బండి సంజయ్ యశోద హాస్పిటల్ లో చేర్పించారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతూ… నిన్న సాయంత్రం మృతిచెందారు. నిన్నరాత్రి పోలీసు బందోబస్తు మధ్య శ్రీనివాస్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీని భారీ బందోబస్తు మధ్య……. సొంతూరు తుమ్మలోనిగూడెంకు అర్ధరాత్రి తీసుకెళ్లారు.

శ్రీనివాస్ మరణం బాధించిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే శ్రీనివాస్ కు అసలైన నివాళి అన్నారు. కార్యకర్త శ్రీనివాస్ పాడె మోసిన బండి సంజయ్….. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామన్నారు సంజయ్. శ్రీనివాస్ మరణం హిందుత్వంపై దాడి అన్నారు ఎంపీ అర్వింద్. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి. ధైర్యంగా ప్రభుత్వంపై పోరాడుదామన్నారు.