కాంగ్రెస్  అధికారంలోకి వస్తేనే అభివృద్ధి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్  అధికారంలోకి వస్తేనే అభివృద్ధి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్  అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హన్వాడ మండలంతో పాటు వేపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్  పార్టీకి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు 50 మంది కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీ అందరిని ఆదుకుంటుందని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పీసీసీ ఉపాధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, నాయకుడు ఎన్పీ వెంకటేశ్, సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, టంకర కృష్ణయ్యయాదవ్  పాల్గొన్నారు.

కులగణన ప్రకారమే సంక్షేమ ఫలాలు..

పాలమూరు: రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామని మహబూబ్​నగర్  కాంగ్రెస్  అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పార్టీ ఆఫీస్​లో మైనార్టీ డిక్లరేషన్  పోస్టర్​ను రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్  ప్రభుత్వం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలను మోసం చేశారన్నారు. బీఆర్ఎస్  హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, మైనార్టీలు విద్యలో వెనబడ్డారని పేర్కొన్నారు.