ఉన్నత విద్యామండలి ఇన్ చార్జి సెక్రటరీగా శ్రీరాం వెంకటేశ్

ఉన్నత విద్యామండలి ఇన్ చార్జి సెక్రటరీగా శ్రీరాం వెంకటేశ్

హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇన్ చార్జి సెక్రటరీగా శ్రీరాం వెంకటేశ్​ను సర్కారు నియమించింది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్​గా ఉన్న ఆయనకు అడిషనల్ బాధ్యతలు అప్పగించింది. నేడో, రేపో శ్రీరాం వెంకటేశ్ అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, ప్రస్తుతం కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తున్న  శ్రీనివాస్​రావును నకిరేకల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్​గా బదిలీ చేసింది. దీంతో ఆయన  బుధవారం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్​లో వీడ్కోలు సమావేశం నిర్వహించి ఆయనను ఘనంగా సన్మానించారు.