ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర

ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర

శ్రీ రామ నవమి సందర్భంగా హైదరాబాద్ సీతారాంబాగ్…రాణి అవంతీ భాయ్ ఆలయం నుంచి సీతా రాముల శోభయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని వ్యాయామ శాల వరకు శోభయాత్ర సాగనుంది. శ్రీ రామ ఉత్సవ సమితి, భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

పురానాపూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. ఇబ్బంది లేకుండా యాత్ర జరిగేలా 2500 మంది పోలీసులతో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో సుమారు 200 సీసీ కెమెరాలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.