శ్రీరాంసాగర్ కు మళ్లీ పెరిగిన వరద 

శ్రీరాంసాగర్ కు మళ్లీ పెరిగిన వరద 

నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. నిన్నటి నుంచి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ రెండు రోజులుగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది. వరద ముందపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ ప్రవాహం పెరుగుతుండడం పరివాహక ప్రాంతాలను ఆందోళనకు గురిచేస్తోంది. 

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద 22 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయానికి శ్రీరాం సాగర్ వద్ద వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 90,190 క్యూసెక్కులుగా నమోదు అయింది. గేట్ల ద్వారా, కాలువలకు మొత్తం 74 వేల 952 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
శ్రీరాం సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1088 అడుగులు 76.424 టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తూ.. దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నామని.. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.