శ్రీరాంసాగర్కు 45వేల క్యూసెక్కుల వరద

శ్రీరాంసాగర్కు 45వేల క్యూసెక్కుల వరద

నిజామాబాద్, వెలుగు: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌‌లోకి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్ట్‌‌లోనికి  45,639  క్యూసెక్కుల వరద వస్తుండగా శుక్రవారం ఉదయం 22  గేట్లను ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గేట్లు మూసివేసి 16 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు  కాగా గురువారం నాటికి 1,088 అడుగులుకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 90  టీఎంసీలు కాగా ప్రస్తుతం 76 టీఎంసీల నీరు ఉంది. ఆఫీసర్లు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెరుతున్న వరద ఉధృతిని అంచావేస్తూ నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.