శ్రీశైలంలో 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలంలో  4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాల గట్టు  పెద్ద బ్రిడ్జి వద్ద భారీగా వాహన రాకపోకలు స్తంభిస్తున్నాయి. శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు  కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. దీనితో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వాహనాలు కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి వస్తున్నాయి. వాహనాలు ఎక్కువవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరుసగా సెలవు దినాలు కావడంతో శ్రీశైల క్షేత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో రావడంతో వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఎస్సై గంగయ్య యాదవ్ ఆదేశాలతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

Also Read :- తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం

ముఖద్వారం నుండి శ్రీశైలానికి అలానే శ్రీశైలం నుండి తిరిగి వెళ్లేటప్పుడు శ్రీశైలం టోల్ గేట్ నుండి సాక్షి గణపతి వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర గంటల సేపు ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తుల ఇబ్బందుల గురయ్యారు. సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో విషయం తెలుసుకొని స్పందించిన దేవస్థానం అధికారులు పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేయాల్సివచ్చింది.