శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్పర్శ దర్శనం రద్దు..

శ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్పర్శ దర్శనం రద్దు..

శ్రీశైలం మల్లన్న  దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ వేళ వరుస సెలవులు రావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

 పవిత్రమైన శ్రావణమాసం... జనాలు గుళ్ల బాట పట్టారు.  వీకెండ్​  సెలువులు ... శ్రావణమాసం చివరి వారం  కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు. మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది  కృష్ణాష్టమి విశేషమైన రోజు ( ఆగస్టు 16) కావడంతో  భక్తులు తెల్లవారుజామున   పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. 

 భక్తుల రద్దీ కారణంగా ఈనెల 18 వరకు శ్రీస్వామివారి గర్భాలయ,అభిషేకాలు సామూహిక అభిషేకాలు..  నిలిపివేశారు.  శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శనం కూడా రద్దు చేసి భక్తులందరికి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. 

ఇప్పటికే క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి గంటల తరబడి వేచి చూస్తున్నారు.  శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. 

 శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు గంట నుండి 2 గంటల సమయం పడుతుంది.  భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు కలుగకుండా అల్పాహారం... మంచినీరు ...బిస్కెట్స్... పాలు అందిస్తున్నామని ఆలయ ఈవో  తెలిపారు