శ్రీశైలం, నాగార్జునసాగర్.. కృష్ణా​బోర్డు  పరిధిలోకి!

శ్రీశైలం, నాగార్జునసాగర్.. కృష్ణా​బోర్డు  పరిధిలోకి!
  •  పవర్​హౌస్​లు మినహా ఔట్​లెట్ల అప్పగింతకు ఏపీ, తెలంగాణ ఓకే
  • కేఆర్​ఎంబీ సమావేశంలో నిర్ణయం
  • ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని జనవరి 27న జలశక్తి శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్​ సెక్రటరీ లేఖ
  • కేఆర్ఎంబీ మీటింగ్​ తర్వాత మీడియాకు లేఖ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. గురువారం జలసౌధలోని కేఆర్ఎంబీ చైర్మన్​ శివ్​నందన్​కుమార్​చాంబర్​లో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టులు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణ రెడ్డి, మురళీధర్ ఓకే చెప్పారు. పవర్​హౌస్​లు మినహా మిగతా అన్ని ఔట్​లెట్ల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. పవర్​హౌస్​లపై మరోసారి సమావేశం కానున్నారు. గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్​వే, రివర్​స్లూయిజ్​లు, ఏపీ భూభాగంలోని పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి పంప్​హౌస్, ముచ్చుమర్రి పంప్​హౌస్, తెలంగాణ భూభాగంలోని కల్వకుర్తి లిఫ్ట్​స్కీం పంపుహౌస్ లను బోర్డు నిర్వహణకు అప్పగించాలని నిర్ణయించారు.

నాగార్జునసాగర్​ప్రాజెక్టులోని స్పిల్ వే, రైట్, లెఫ్ట్​కెనాళ్ల​హెడ్​రెగ్యులేటర్స్, ఫ్లడ్​ఫ్లో కెనాల్ ​హెడ్​ రెగ్యులేటర్, ఏఎమ్మార్ ​లిఫ్ట్​స్కీం పంపుహౌస్, రివర్, చూట్ స్లూయిజ్​లు బోర్డు నిర్వహణలోకి వెళ్లనున్నాయి. ఆయా ఔట్​లెట్ల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ పర్యవేక్షణలో చేయాలని, ఒక్కో ఔట్​లెట్​వద్ద రెండు రాష్ట్రాల నుంచి ఇంజనీర్లను, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. మూడు షిఫ్టుల్లో ఆయా ఔట్​లెట్ల వద్ద రెండు రాష్ట్రాల సిబ్బంది పని చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఆయా ఔట్​లెట్ల వద్ద మూడు షిఫ్టుల్లో కలిపి 30 మంది చొప్పున సిబ్బందిని డిప్యూట్ ​చేయాలని, వారు బోర్డు నియంత్రణలో పని చేస్తారని నిర్ణయం తీసుకున్నారు.

ఏ ఔట్​లెట్​ నుంచి నీటిని విడుదల చేయాలన్నా కేఆర్ఎంబీ త్రీ మెంబర్​కమిటీ (బోర్డు మెంబర్​సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు కలిపి ఉన్న కమిటీ) నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాగార్జున సాగర్​ఆపరేషన్స్​అండ్​మెయింటనెన్స్​పనులు తెలంగాణ చూస్తున్నందున.. శ్రీశైలం రిపేర్లు, ఓ అండ్​ఎం పనులు ఏపీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్​ప్రాజెక్టుపైనే సీఆర్పీఎఫ్​బలగాలను మోహరించాలని, ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుపై అవసరం లేదని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులపై ఉన్న ఔట్​లెట్ల నిర్వహణకు నియమించే సిబ్బంది వేతనాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రాజెక్టుల ఆపరేషన్​నే ఆర్ఎంబీకి అప్పగించాం: తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ 

నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్​ను కేఆర్ఎంబీకి అప్పగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​తెలిపారు. కేఆర్ఎంబీ మీటింగ్​అనంతరం జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ఓ అండ్​ఎంను ఏపీ.. నాగార్జునసాగర్​ఓ అండ్​ఎం తెలంగాణ చూసుకుంటుందని, ఇకపై ప్రాజెక్టులు బోర్డు పరిధిలోనే నడుస్తాయని తెలిపారు. పవర్​స్టేషన్​హ్యాండోవర్​పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

కృష్ణాలో తెలంగాణకు 50% వాటా ఇవ్వాలని కేంద్రానికి లేఖలు రాశామని, వాటిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నీటి విడుదలపై త్రీ మెంబర్​ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టులపై మొహరించే సీఆర్పీఎఫ్​బలగాలు కూడా బోర్డు పరిధిలోనే పని చేస్తాయన్నారు. ప్రాజెక్టులను పూర్తిగా బోర్డుకు అప్పగించలేదని.. ఆపరేషనల్, నీటి విడుదల చూసుకుంటుందని తెలిపారు. 

ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరం లేదు: ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమ రాష్ట్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల ఆపరేషన్​కోసం రెండు రాష్ట్రాల నుంచి స్టాఫ్​కేటాయిస్తామని, వాటర్​రిలీజ్​పై త్రీమెంబర్​కమిటీదే తుది నిర్ణయమన్నారు. ఆయా ప్రాజెక్టుల్లో అప్పుడు నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా త్రీమెంబర్​కమిటీ ఆపరేషనల్​ ప్రొటోకాల్​పై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏపీ తాగునీటి కోసం మార్చిలో కుడి కాలువ​నుంచి 3 టీఎంసీలు, ఎడమ కాలువ 2 టీఎంసీలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేషన్​ను బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ కూడా ఒప్పుకుందన్నారు.

ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోం: ఇరిగేషన్ ​సెక్రటరీ

నీటి వాటాలు తేలేవరకు.. శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రొటోకాల్​పై స్పష్టత వచ్చే వరకు ఆ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలంగాణ ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్​బొజ్జా తెలిపారు. జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోని మినిట్స్​పై అభ్యంతరాలు తెలుపుతూ ఆయన జనవరి 27న ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖను గురువారం సాయంత్రం మీడియాకు రిలీజ్​చేశారు. తాము లేవనెత్తిన అంశాలను మినిట్స్​లో చేర్చలేదని.. ఆ మీటింగ్​లోనూ తాము ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

ఏపీ రీ ఆర్గనైజేషన్​యాక్ట్ లోని షెడ్యూల్​–12 ప్రకారం ఏ రాష్ట్ర భూభాగంలోని హైడల్​పవర్​ప్లాంట్లు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించబోమని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణలో అత్యంత కీలకమైనది ఆపరేషనల్​ప్రొటోకాల్ అని,  దీనిని బ్రజేశ్​కుమార్​ ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ –2) ఖరారు చేయాల్సి ఉందని, నీటి వాటాలు తేల్చాల్సింది కూడా ఆ ట్రిబ్యునల్​అని పేర్కొన్నారు. నీటి వాటాలు తేలేవరకు, కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇస్తే తప్ప ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్నారు.

శ్రీశైలం నుంచి ఏపీ ఇతర బేసిన్​లకు నీటిని తరలిస్తున్నదని, దీనిని అడ్డుకోవాలని కోరారు. శ్రీశైలం రైట్ బ్యాంక్​కెనాల్​కు 19, చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​నుంచి తీసుకునేలా ఏపీని కట్టడి చేయాలని అన్నారు. శ్రీశైలం నీటి వినియోగానికి ఏపీ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలని, నాగార్జునసాగర్​డ్యామ్​పై తెలంగాణ భూభాగంలో సీఆర్పీఎఫ్​బలగాల మోహరింపు అవసరం లేదని తెలిపారు. వెంటనే కేంద్రం జనవరి 17వ తేదీ మీటింగ్​మినిట్స్​లో తెలంగాణ అభ్యంతరాలను చేర్చి మళ్లీ మినిట్స్​జారీ చేయాలని ఆయన లేఖలో కోరారు.