
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ (TTD) పలు ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు, వృద్ధులను దర్శనానికి అనుమతించలేదు. లేటెస్టుగా శ్రీవారి దర్శనం విషయంలో నిబంధనలు ఎత్తివేసింది. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల లోపు పైబడిన వారికి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవచ్చంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యంలేదని స్పష్టం చేసింది. అయితే, ముందస్తుగా దర్శన టికెట్ల బుక్ చేసుకోవాలని… దర్శన టికెట్లు కలిగిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతించనున్నట్లు TTD అధికారులు తెలిపారు. అనుమతిస్తారు.