ఆకాశంలో 200 సెకన్లు బ్రేక్ తీసుకుని.. మళ్లీ జర్నీ చేసిన ఆదిత్య L1

ఆకాశంలో 200 సెకన్లు బ్రేక్ తీసుకుని.. మళ్లీ జర్నీ చేసిన ఆదిత్య L1

ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్ 2023 ప్రయోగం విజయవంతమైంది.   ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సెప్టెంబర్ 2వ తే దీ శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుండి ఉదయం 11:50 గంటలకు ఆదిత్య-ఎల్1ని విజయవంతంగా ప్రయోగించింది. 

సరిగ్గా 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 మిషన్ లాంఛ్ అయింది. నాలుగు నిమిషాలకు అంతరిక్ష నౌకను కవర్ చేసే పేలోడ్ ఫేరింగ్ వేరచేయబడింది. తొలి రెండు దశలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్దేశించబడిన కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1 రాకెట్ వెళ్లింది. 

అయితే మూడో దశలో ఆదిత్య ఎల్ 1 రాకెట్ కొద్దిసేపు బ్రేక్ తీసుకుంది. పేలోడ్ ఫెయిరింగ్ వేరు చేయబడిన తర్వాత ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ లో 200 సెకన్ల పాటు కోస్టింగ్ దశలో ఆగింది. ఆ తర్వాత మళ్లీ నిర్దేశించిన కక్ష్యంలో రాకెట్ కొనసాగింది. మూడో దశలో భూమికి 280 కిలో మీటర్ల ఎత్తులో  రాకెట్ కోస్టింగ్ దశలో కొనసాగింది.

భూమి నుంచి నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత ఆదిత్య ఎల్ 1 రాకెట్..63 నిమిషాల తర్వాత  రాకెట్ ఆదిత్య-L1ని ఎజెక్ట్ చేసింది. అనంతరం మూడు దశలను విజయవంతంగా దాటిన ఆదిత్య ఎల్ 1...నాల్గవ దశను అంతే విజయవంతంగా క్రాస్ చేయడంతో మొత్తం73 నిమిషాలలో ప్రయోగం ముగిసింది. ఇస్రో నిర్దేశించిన నిర్ణీత కక్ష్యలోకి వెళ్లింది. సక్సెస్ ఫుల్ గా సూర్యుడి వైపు దూసుకెళ్తోంది.