పునర్జన్మల కథతో గత వైభవం

పునర్జన్మల కథతో గత వైభవం

ఎస్ఎస్ దుశ్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన  చిత్రం ‘గత వైభవం’.  సింపుల్ సుని దర్శకత్వం వహిస్తూ  దీపక్ తిమ్మప్పతో కలిసి నిర్మించారు.  నవంబర్ 14న తెలుగు, కన్నడ భాషల్లో  సినిమా రిలీజ్ కానుంది. ప్రైమ్‌‌షో ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ ‘నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. 

నాలుగు జనరేషన్ల కథతో రాబోతున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని దుశ్యంత్ అన్నాడు. ఎమోషనల్‌‌గా కనెక్ట్ అవుతూ సినిమా చేశామని ఆషికా రంగనాథ్ చెప్పింది.  అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న ప్రయోగాత్మక చిత్రమిది అని  డైరెక్టర్ సింపుల్ సుని అన్నాడు.  ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు దీపక్, చైతన్య రెడ్డి అన్నారు.