SS Karthikeya: SS కార్తికేయ ఎమోషనల్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రమా రాజమౌళి.. వీడియో వైరల్

SS Karthikeya: SS కార్తికేయ ఎమోషనల్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రమా రాజమౌళి.. వీడియో వైరల్

ఫ‌‌‌‌హాద్ ఫాజిల్, బేబి సారా లీడ్ రోల్స్‌‌‌‌లో శశాంక్ యేలేటి  రూపొందించిన చిత్రం  ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. SS రాజ‌‌‌‌మౌళి సమ‌‌‌‌ర్పణ‌‌‌‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కార్తికేయ నిర్మించారు.  అక్టోబర్ 2న విడుదల కానుంది.  మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు.

చీఫ్‌‌‌‌  గెస్ట్​గా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘కోవిడ్ టైమ్‌‌‌‌లో ఓటీటీ ద్వారా  ఫహాద్ ఫాజిల్ మనకు దగ్గరయ్యారు. ఆయన నటన నాకెంతో  ఇష్టం. చాలాసార్లు నన్ను ఇన్‌‌‌‌స్పైర్ చేశారు. భారతదేశం గర్వించదగ్గ నటుడు ఆయన. తెలుగులో ఆయన హీరోగా నటించిన తొలిచిత్రం ఇది.  ఇక కార్తికేయతో నా బాండింగ్  చాలా ప్రత్యేకమైనది. తను నా తమ్ముడు.  నన్ను ఎంతలా ఆదరించారో  కార్తికేయను కూడా ఆదరించాలని కోరుతున్నా. టీమ్ అందరి కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది  గొప్ప సినిమాగా నిలవాలని కోరుకుంటున్నా.  అలాగే 25 సంవత్సరాల ‘ స్టూడెంట్ నెంబర్ వన్’  సెలబ్రేషన్స్‌‌‌‌ను ఇలా నా కుటుంబంతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.’ అని అన్నారు. 

రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఫహాద్ ఫాజిల్ ఇంటెన్స్ యాక్టర్. తెలుగు ఆడియెన్స్‌‌‌‌ను కూడా ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘ఒక దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ’  అని శశాంక్ ఈ స్టోరీ లైన్ నాకు  చెప్పాడు. చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌గా అనిపించింది. రీసెంట్‌‌‌‌గా సినిమా చూశా. ఎంత నవ్వించారో అంత ఏడ్పించారు. చాలా హార్ట్ టచింగ్‌‌‌‌గా అనిపించింది. పెద్దవాళ్లలో ఉన్న చిన్న పిల్లల కోసం తీసిన సినిమా ఇది’’ అని చెప్పారు. 

ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ వేదికపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చాలా అందమైన చిత్రమని, ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైందని అన్నారు. కుటుంబం అంతా కలిసి హ్యాపీగా చూడగలిగే సినిమా ఇదని తెలిపారు.

తండ్రి రాజమౌళి తనకు ఎప్పుడూ అండగా నిలిచారని.. ఆయన పేరుకు ఎలాంటి భంగం కలగకుండా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన ధ్యేయమని కార్తికేయ పేర్కొన్నారు.

అదే సమయంలో తన తల్లి రమా రాజమౌళి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ కార్తికేయ ఎమోషనల్ అయ్యారు. ‘నా కుటుంబమే నాకు అతిపెద్ద కొండంత అండ’ అంటూ ఆయన చెప్పిన మాటలకు రమా రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఈవెంట్‌లో ఆ సన్నివేశం ప్రత్యేకంగా నిలిచింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని కూడా కార్తికేయ ప్రత్యేకంగా చాటుకున్నారు. ‘తారక్ అన్న’తో తనకు ఎంతో ఆత్మీయమైన బంధం ఉందని చెబుతూ, తనకు అందించిన ప్రేమ, మద్దతుకు ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఆడియెన్స్ ఇచ్చే ప్రేమ వెలకట్టలేనిది. హైదరాబాద్ నాకు చాలా స్పెషల్. నన్ను చాలామంది పుష్పలో చూశారు. కొందరు ఓటీటీలో చూశారు. కానీ ఈసారి స్ట్రయిట్ తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా’’ అని చెప్పాడు. తనను  నమ్మి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ  దర్శకుడు శశాంక్ యేలేటి థ్యాంక్స్ చెప్పాడు. ఫన్ అండ్ ఎమోషన్‌‌‌‌తో ఈ చిత్రం  ఆడియెన్స్‌‌‌‌ ముందుకు రాబోతోందని, ఇది టీమ్ అందరికీ మెమొరబుల్ మూవీ అవుతుందని నిర్మాతలు  శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, అన్నారు.

దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్ రాజు, నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, కే.ఎల్. నారాయణ,  నాగవంశీ, స్వప్నా దత్,  మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి  టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.   బేబీ సారా, సుబ్బరాజు, వెంకటేష్ కాకుమాను, శశాంక్,  మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.