మేడ్ ఇన్ ఇండియా.. కొత్త సినిమా ప్రకటించిన రాజమౌళి

మేడ్ ఇన్ ఇండియా.. కొత్త సినిమా ప్రకటించిన రాజమౌళి

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తన కొత్త సినిమాను ప్రకటించారు. అదే మేడ్ ఇన్ ఇండియా(Made in india). అదేంటి ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి మహేష్ బాబు(Mahesh babu)తో సినిమా చేయాలి కదా.. మరి ఇప్పుడు ఈ కొత్త సినిమా ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. రాజమౌళి సమర్పణలో ఓ సినిమా రానుంది. ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 

భారతీయ సినీ చరిత్రను తెలియజేస్తూ.. మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక పాన్ ఇండియా సినిమా రానుంది. ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు.. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వీడియోను రిలీజ్ చేసిన రాజమౌళి... ఓ X(ఎక్స్) పోస్టు చేశారు.  

'నేను మొదట మేడ్ ఇన్ ఇండియా కథనం విన్నప్పుడు.. చాలా భావోద్వేగంగా ఫీల్ అయ్యాను. అది నన్ను కదిలించింది. బయోపిక్స్ చేయడం చాలా కష్టం. అందులోనూ భారతీయ సినిమా పితామహుడు గురించి చేయడం సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ తన భావాన్ని పంచుకున్నారు రాజమౌళి.

ALSO READ:  రతిక.. ఎందుకంత ఓవరాక్షన్.. భరించలేకపోతున్నాం!

మేడ్ ఇన్ ఇండియా సినిమా విషయానికి వస్తే..  ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్ సినిమా అంటే అందరికీ గుర్తొచ్చే పేరు దాదాసాహెబ్ ఫాల్కే. అతనిని భారత సినిమా పితామహుడు అని పిలుస్తారు. 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్ర సినిమా ఆయన నిర్మించిన తొలి ఇండియన్ సినిమా. ఆయన బయోపిక్‌ను సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది? ఆ సినిమాలో ఎవరెవరు నటిస్తారు? అనే వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.