రతిక.. ఎందుకంత ఓవరాక్షన్.. భరించలేకపోతున్నాం!

రతిక.. ఎందుకంత ఓవరాక్షన్.. భరించలేకపోతున్నాం!

రతిక(Rathika).. రతిక.. బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎక్కడ చూసినా ఆ కంటెస్టెంట్ వినిపిస్తోంది. అయితే అది ఆటలో, టాస్క్ లలో కనిపిస్తే చాలా బాగుండేది. కానీ కావాలని ఎదో ఫుటేజ్ కోసం కెమెరాల ముందు చేస్తేనే చిరాకొస్తుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్నది అదే. బిగ్ బాస్ లో విన్నర్ అవ్వాలంటే జనాలకు ఎక్కువగా కనిపించాలి అనే విషయాన్ని బాగా బట్టీ పట్టినట్టుంది రతిక. అందుకే కావాలని కెమెరాల ముందు ఓవరాక్షన్  చేస్తోంది. 

ఇందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా కనిపించింది. అలా చాలా రోజులు ఫుటేజ్ ను కవర్ చేసింది. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ ప్రశాంత్ ను టార్గెట్ చేయడంతో.. అతన్ని పక్కన పెట్టేసింది. గత వారంలో యావర్ హైలెట్ కావడంతో..  ఇప్పుడు అతనితో ట్రాక్ ను మొదలు పెట్టింది. వీకెండ్ లో నాగార్జున కూడా ఈ ఇద్దరి గురించి ప్రస్తావించాడు. మొత్తానికి తాను అనుకున్నట్లుగా ఆడియన్స్ నోళ్ళలో తిరుగుతోంది రతిక. 

ALSO READ: అంతా చీకటి.. విజువల్స్ లేకుండా UI టీజర్.. ఇది చాలా డిఫరెంట్ గురూ!

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎంతకాలం ఇలా ట్రాకులు నడుపుతూ, బిగ్ బాస్ కు ఫుటేజ్ ఇస్తూ నెట్టుకొస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా రిలీజైన ప్రోమోలో కూడా ఏడుస్తూ కనిపించి తనకు కావాల్సిన ఫుటేజ్ ను దక్కించుకుంది. ఇవన్నీ చుసిన ఆడియన్స్ మాత్రం రతికపై చిరాకు పడుతున్నారు. ఎందుకు ఈ డ్రామాలు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటె ఆది చూపించు. గేమ్ అంతా అయ్యాక పక్కవాళ్లపై నెట్టేయడం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. ఆడియన్స్ అంతా చూస్తున్నారు.. నీ వేశాలేం ఇక్కడ సాగవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.