హాలీవుడ్ డైరెక్టర్‌ను కలిసిన ఎస్ఎస్ రాజమౌళి

హాలీవుడ్ డైరెక్టర్‌ను కలిసిన ఎస్ఎస్ రాజమౌళి

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్ స్పిల్‌బర్గ్‌ను దర్శక ధీరుడు రాజమౌళి కలిశారు. ఈ సమయంలో ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో ఒకదాంట్లో.. రాజమౌళి తన రెండు చేతులను చెంపలకు అడ్డంగా పెట్టుకొని, చిన్న పిల్లల మనస్తత్వాన్ని ప్రదర్శించగా... మరో ఫొటోలో ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, స్టీవెన్ స్పిల్ బర్గ్ తో రాజమౌళి ప్రేమ్ ను పంచుకున్నారు. దాంతో పాటు ఇప్పుడే దేవుడిని కలిశాననే క్యాప్షన్ ను, లవ్ సింబల్స్, ఫైర్ సింబల్స్ తో జోడించారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. సినిమా మీట్స్ సినిమా అని ఒకరంటే.. మీరిద్దరూ మా బాల్యాన్ని గుర్తుకుతెచ్చిన లెజెండ్స్ అని మరొకరు కామెంట్ చేశారు.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ పై అందరూ ప్రశంసలు గుప్పించారు. దాంతో రాజమౌళి ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంగీతానికి హద్దులుండవని, నాటు నాటు పాటను అందించినందుకు కీరవాణికి అభినందనలు తెలియజేశారు. కాగా గాడ్‌ ఆఫ్‌ మూవీస్‌గా అభివర్ణించే  స్పిల్‌బర్గ్‌.. ‘జురాసిక్‌ పార్క్‌’, ‘హుక్‌’, ‘ది టర్మినల్‌’, ‘ది పోస్ట్‌’ వంటి గొప్ప చిత్రాలకు స్పిల్‌బర్గ్‌ దర్శకత్వం వహించారు.

https://twitter.com/ssrajamouli/status/1614107808680792064