SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. బాహుబలి బిజ్జలదేవని మించిన 'కుంభ'.. క్రూరమైన విలన్గా పృథ్వీరాజ్

SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. బాహుబలి బిజ్జలదేవని మించిన 'కుంభ'.. క్రూరమైన విలన్గా పృథ్వీరాజ్

మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ‘SSMB 29’ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి 'కుంభ'కు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉందంటూ జక్కన్న తెలిపారు. 

ఎవరూ ఊహించని విధంగా పృథ్వీరాజ్ లుక్ ను డిజైన్ చేశారు జక్కన్న. విలన్ రోల్స్కి ప్రాధాన్యత ఇచ్చే రాజమౌళి.. ఈసారి కూడా తనదైన పంథాలో వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. బాహుబలి బిజ్జలదేవుని మించిన నైజాం 'కుంభ' లో కనిపిస్తుంది. మహేష్ లాంటి ఆరడుగుల ఆజానుబాహుడ్ని ఎదుర్కోవాలంటే ధీటైన పాత్ర ఉంటే చాలదు.. వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే విలనిజం ఉండేలా ప్లాన్ చేశారు జక్కన్న.  

SSMB29 Updates:

రాజమౌళి అప్డేట్ ఇస్తూ.. 'సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు #Globetrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న ఈవెంట్ మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా' అంటూ రాజమౌళి ట్వీట్ చేయడం మరింత భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 

అయితే, ఈనెల 15న హైదరాబాద్‌‌‌‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌‌‌‌ట్రాటర్’ పేరుతో గ్రాండ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించబోతున్నారు. ఇందులో మహేష్ ఫస్ట్ లుక్‌‌‌‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌‌‌‌ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు వస్తారని అంచనా ఉంది. అలాగే జియో హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్ స్ట్రీమింగ్‌‌‌‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు.

హీరోయిన్ ప్రియాంక చోప్రాతో టీమ్ అంతా పాల్గొననున్న ఈ ఈవెంట్‌‌‌‌ను హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్‌‌‌‌గా నిర్వహించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే.. ఈ మధ్య ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించిన ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ సినిమాలో యాక్టర్, రైటర్, డైరెక్టర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా పృథ్వీరాజ్ ది గోట్ లైఫ్ మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే, మలయాళ స్టార్ మోహన్ లాల్తో లూసిఫర్2 డైరెక్ట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు.