తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దు

తెలంగాణలో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. రాష్ట్రంలో కూడా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో టెన్త్ ఎగ్జామ్స్​ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష నిర్వహించాలని టెన్త్ బోర్డు నిర్ణయించింది. ఆ మార్కులతో సంతృప్తి చెందని వారికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కాగా.. ఇంటర్ పరీక్షలకు సంబంధించి.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని.. సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.