నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

నేటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. అయిదు నిమిషాలు లేటైనా ఓకే..

రాసేది: 5,34,903 మంది

5 నిమిషాలు లేటైనా ఓకే!

ఎగ్జామ్​ సెంటర్లలో కరోనా జాగ్రత్తలు

పరీక్ష హాళ్లలో మందు స్ప్రే

స్టూడెంట్స్​ మాస్క్​లతో రావొచ్చు

అందుబాటులో శానిటైజర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం నుంచి టెన్త్​ పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలు చేయడం లేదు. స్టూడెంట్స్​ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా సెంటర్​ లోపలికి అనుమతించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు, కరోనా వైరస్  నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 11,045 స్కూళ్ల నుంచి 5,34,903 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వారిలో అబ్బాయిలు 2,73,971 మంది, అమ్మాయిలు 2,60,932 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్​ విద్యార్థులు 5,09,079 మంది, ప్రైవేటు క్యాండిడేట్లు 25,824 మంది. 2,530 ఎగ్జామ్స్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 30,500 మంది ఇన్విజిలేటర్లను.. 2,530 మంది సీఎస్​లను, మరో 2,530 మంది డీఓలను నియమించారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు స్పెషల్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 144 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్​లను ఏర్పాటు చేశారు. హాల్​టికెట్లు అందని స్టూడెంట్స్​ bse.telangana.gov.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

వాటర్ బాటిల్స్​కు అనుమతి

కరోనా ​వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచే ​ సెంటర్లలోకి అనుమతించనున్నారు. మాస్కులతో వచ్చినా, వాటర్​ బాటిళ్లు తెచ్చిన వారిని కూడా అనుమతిస్తారు. ప్రతి సెంటర్​లో లిక్విడ్ సోప్​ ను అందుబాటులో ఉంచుతున్నారు. ఎగ్జామ్​ సెంటర్లలో ప్రతిరోజు ఉదయం టేబుల్స్, డోర్లను క్లీన్ చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సీఎస్, డీఓలకు ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబుతో బాధపడే స్టూడెంట్లకు స్పెషల్ రూమ్స్​కేటాయించాలని సూచించారు.ఎగ్జామ్ టైమ్ లో కరెంట్ సరఫరా చేయాలని ట్రాన్స్ కో అధికారులను, స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్

కరోనాకు భయపడి కేసీఆర్ ఫాంహౌస్‌లో దాక్కున్నారు