మాదాపూర్, వెలుగు: రూ.30వేలు లంచం తీసుకుంటూ మాదాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎస్సై, రైటర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌బాబు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్వీకర్సెక్షన్ కాలనీకి చెందిన లక్షణ్నాయక్ తన భార్య పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని కూతురికి ఇచ్చాడు. అందులో ఇంటి నిర్మాణం చేపడుతుండగా, సదరు స్థలం మాది అంటూ సుధా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే మాదాపూర్ ఎస్సై రంజిత్.. లక్షణ్నాయక్ కు ఫోన్‌చేసి బెదిరించాడు. కేసు లేకుండా చేస్తానని, తనకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్చేశాడు. లేకుంటే కుటుంబం మొత్తంపై కేసు బుక్‌చేస్తానని భయపెట్టాడు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో మొదట రూ. 50 వేలు, చివరకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్చేశాడు.
దీంతో లక్ష్మణ్ నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు. శనివారం మధ్యాహ్నం ఎస్సై రంజిత్‌కు రూ.20వేలు ఇవ్వబోగా, తనకు రూ.30 వేలు ఇస్తేనే తీసుకుంటానని చెప్పాడు. దీంతో లక్షణ్నాయక్తన కొడుకు వద్ద మరో రూ.10వేలు తీసుకొని మొత్తం రూ.30వేలను స్టేషన్రైటర్విక్రమ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైటర్‌తోపాటు ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.