SSMB29.. noveMBer 15న రామోజీ ఫిల్మ్ సిటీలో.. లక్ష మందితో భారీ ఈవెంట్

SSMB29.. noveMBer 15న రామోజీ ఫిల్మ్ సిటీలో.. లక్ష మందితో భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా  రాజమౌళి దర్శకత్వంలో  ఓ భారీ అడ్వెంచరస్‌‌‌‌ మూవీ  రూపొందుతోంది. ‘ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎంబీ 29’ వర్కింగ్‌‌‌‌ టైటిల్‌‌‌‌తో తెరకెక్కుతోన్న  ఈ  సినిమా  షూటింగ్ జరుగుతోంది. నవంబర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ లుక్‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీనికోసం జక్కన్న  ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 15న హైదరాబాద్‌‌‌‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌‌‌‌ట్రాటర్’ పేరుతో  గ్రాండ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించబోతున్నారు.

ఇందులో  ఫస్ట్ లుక్‌‌‌‌తోపాటు  టైటిల్ గ్లింప్స్‌‌‌‌ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు వస్తారని అంచనా ఉంది. అలాగే జియో హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్ స్ట్రీమింగ్‌‌‌‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రాతో టీమ్ అంతా పాల్గొననున్న ఈ ఈవెంట్‌‌‌‌ను హాలీవుడ్ స్థాయిలో  గ్రాండ్‌‌‌‌గా  నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.  దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.