తాడ్వాయి, వెలుగు: సమ్మక్క, సారలమ్మ జాతర దేశానికి ప్రత్యేకమైన పండుగ అని ఎస్టీ కమిషన్ సభ్యులు జె.హుస్సేన్ నాయక్ అన్నారు. వచ్చే నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలను జాతర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను కలిశారు.
మహా జాతర సందర్భంగా రైతులు రెండో పంట నష్టపోతున్నారని, భూములు కూడా కోల్పోతున్నారని వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో పూజారుల సంఘం నాయకులు సిద్ధబోయిన సురేందర్, చందా మహేశ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భర్త పురం నరేశ్, నాయకులు తదితరులు ఉన్నారు.
