- బియ్యం కడగకుండానే వంటలు
- విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
కామేపల్లి, వెలుగు : కామేపల్లి ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం పెట్టిన టిఫిన్‌లో పురుగులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా కామేపల్లి ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో కొంతకాలం నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు చాలాసార్లు వార్డెన్ వసంత దృష్టికి తీసుకెళ్లారు. అయినా అలాగే జరుగుతోంది. గురువారం ఉదయం కిచిడీ పెట్టడంతో అందులో కూడా పురుగులు వచ్చాయి.
దీంతో కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చారు. వార్డెన్ లేకపోవడంతో హెచ్ఎం నాగేశ్వర్రావుకు ఆ కిచిడీని చూపించి ప్రశ్నించారు. తాము ఇంతకుముందు వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని, పురుగుల అన్నం తిని ఏదన్నా జరిగితే పరిస్థితి ఏమిటని ఆందోళనకు దిగారు. దీంతో వంట వండే వారిపై చర్యలు తీసుకుంటానని, మరోసారి ఇలా జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించారు.
