గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు

గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు

రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గురుకులాల్లోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యవతి రాథోడ్.. గురుకులాల్లో సిబ్బంది నిర్లక్ష్యమే లేదన్నారు. ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు మృతిచెందిన సంఘటనలు, ఫుడ్ పాయిజన్ వంటి కేసులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రావడం చాలా దురదృష్టకరమని, వీటిపై విచారణ జరిపించామని.. ఇందులో గురుకులాల సిబ్బంది నిర్లక్ష్యమే లేదని తేల్చి చెప్పారు. ఆ ఘటనలకు విద్యార్థుల ఆరోగ్య సమస్యలే కారణమన్నారు. మిగతా విద్యార్థులంతా బాగున్నారు కదా..? అని ప్రశ్నించారు మంత్రి సత్యవతి.