కరోనా వ్యాక్సిన్ కాకుండా రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు

కరోనా వ్యాక్సిన్ కాకుండా రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు

నల్గొండ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే టీకా విషయంలో కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన మహిళకి అక్కడి సిబ్బంది కుక్క కాటుకు ఇచ్చే రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లెపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ లో ప్రమీల అనే మహిళ స్విపర్ గా పనిచేస్తోంది. PHC భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కరోనా టీకాలు ఇస్తున్నారు. ప్రమీలకు స్కూల్ ప్రిన్సిపల్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ లెటర్ ఇచ్చారు. PHCకి వెళ్లిన ప్రమీల చేతిలో ఉన్న లేఖను చదవకుండానే... నర్సు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని ప్రమీల ఆరోపిస్తోంది. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.