- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు, పోలీస్ సిబ్బంది
- ఓరుగల్లులో 555 జీపీలు, 4,952 వార్డులకు ఎలక్షన్లు
- ఇప్పటికే 53 జీపీల్లో సర్పంచుల ఏకగ్రీవం
- పలు గ్రామాల్లో 'ఓటుకు నోటు' ఫార్ములా
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో గురువారం పల్లెపోరు జరగనుంది. ఉమ్మడి ఓరుగల్లులోని ఆరు జిల్లాల్లోని కలెక్టర్లు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి పోలీస్ బందోబస్త్ పర్యవేక్షిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎస్పీలు భద్రతపై ఫోకస్ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటివ్వకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి.
502 జీపీల్లో సర్పంచులకు బ్యాలెట్ పోరు
లోకల్‍బాడీ ఎలక్షన్లలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో ఓట్ల కోసం 11న బ్యాలెట్ పోరు జరగనుంది. వరంగల్ 6 జిల్లాల నుంచి మొదటి విడతలో 555 జీపీలు ఉండగా, 53చోట్ల ఏకగ్రీవాలు కావడంతో మిగతా 502 చోట్ల సర్పంచ్ కోసం పోటీ ఉండనుంది. 1,749 మంది సై అంటే సై అంటున్నారు. ఇక మొదటి విడతలో 4,952 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, బరిలో 8,676 మంది ఉన్నారు. 981 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
కోటర్ సీసా., ఓటుకు రూ.500
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకున్నా సర్పంచ్‍బరిలో ఉన్న అభ్యర్థి ఏ పార్టీ మద్దతుదారుడనే విషయంలో క్లారిటీ ఉంది. దీంతో పార్టీల పెద్ద లీడర్లు దీనిని సవాల్‌గా తీసుకోవడంతో చాలా జీపీల్లో ప్రలోభాలు మొదలయ్యాయి. పెద్ద గ్రామ పంచాయతీలు, జనరల్ కోటా రిజర్వేషన్లు ఉన్నచోట ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి జనరల్ ఎలక్షన్ల మాదిరే 'ఓటుకు నోటు' ఫార్ములా అమలు చేస్తున్నారు. దీంతో ఇంటికో కోటర్ సీసాతో పాటు డిమాండ్ మేరకు ఓటుకు రూ.200 నుంచి రూ.500 చొప్పున పంపిణీ చేస్తున్నారని గుసగుసలు వి
నిపిస్తున్నారు.
జిల్లాల వారీగా సర్పంచ్, ఏకగ్రీవం వివరాలు..
జిల్లా జీపీలు బరిలో ఏకగ్రీవాలు కాంగ్రెస్ బీఆర్‍ఎస్ బీజేపీ ఇతరులు
హనుమకొండ 69 263 05 03 01 01 –
జనగామ 110 324 10 09 – – 01
భూపాలపల్లి 82 262 09 09 – – –
ములుగు 48 186 09 09 – – –
మహబూబాబాద్ 155 468 09 06 02 – 01
మొత్తం 555 1,802 53 44 05 01 03
జిల్లాల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఆఫీసర్ల సంఖ్య..
జిల్లా పీఎస్‌లు పీవో ఓపీవో బందోబస్త్
వరంగల్ 731 877 1,098 600
హనుమకొండ 658 761 1,149 500
జనగామ 1024 1,131 1544 1500
భూపాలపల్లి 664 855 1084 500
ములుగు 436 525 652 387
మహబూబాబాద్ 1072 1,621 1853 1,081

