
తమిళనాడు ఎంకే స్టాలిన్ మంగళవారం చెన్నైలో సియం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, స్టాలిన్ సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్లో పిల్లలకు ఆహారం వడ్డిస్తూ, ఈ కొత్త పథకానికి నాంది పలికారు.
20 లక్షల మంది విద్యార్థులు: ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు పోషకమైన భోజనం అందుతుందని, అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రూ.600 కోట్లు కేటాయిస్తామని అన్నారు.
ఈ పథకాన్ని పంజాబ్‌లో కూడా: ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ ఈ పథకాన్ని విస్తరించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్రం ఆహార మిగులు రాష్ట్రం కాబట్టి, ఈ పథకాన్ని పంజాబ్‌లో అమలు చేయడానికి మంత్రులతో చర్చిస్తానని చెప్పారు.
6 మే 2022న సీఎం స్టాలిన్ అసెంబ్లీలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం మొదటి దశ సెప్టెంబర్ 15న మధురైలో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ 5వ దశ విస్తరణలో అల్పాహారం నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని సీఎం స్టాలిన్ అన్నారు.