అనాథలైన చిన్నారులకు రూ.5 లక్షలు

అనాథలైన చిన్నారులకు రూ.5 లక్షలు

కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల బాగోగులు చూసుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కరోనాతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులకు 5 లక్షల రూపాయల సాయం అందించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఈ డబ్బును వారిపేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామన్నారు. 18 సంవత్సరాల తర్వాత వడ్డీతో తీసుకోవచ్చన్నారు. ఇక తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్లకు రూ.3లక్షలు ఇస్తామన్నారు.అంతేగాకుండా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు వారి చదువు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఇక మహారాష్ట్రలోనూ కరోనాతో సర్వం కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తోంది. ఈ మేరకు మహిళా-శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు చనిపోయినా... సాయం అందేలా పాలసీ తయారు చేయాలన్నారు. ఆ విధానంలో... చిన్నారుల ఎడ్యుకేషన్, యోగక్షేమాలు-ఆలనా పాలనా ప్రభుత్వమే చూసేలా ప్రొవిజన్స్ ఉండాలని ఉద్ధవ్ థాకరే నిర్దేశించారు.