రామగుండంలో నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి

రామగుండంలో నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి
  • ఈదురు గాలులకు ఎగిరిపోయిన పైకప్పులు


పెద్దపల్లి జిల్లా: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోకి భారీగా వరదనీరు చేరింది. ఈదురు గాలుల కారణంగా ఫ్యాక్టరీ పైకప్పులు ఎగిరిపోయాయి. అమోనియా యూనిట్, ఆర్సీ యూనిట్, బ్యాంగింగ్ యూనిట్లలో పై కప్పులు ఎగిరిపోయినట్లు సమాచారం. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. కన్వేయర్ ప్రాంతానికి వరద నీరు భారీగా చేరడంతో యూరియా బస్తాలు నీటిలో తడిసి కరిగిపోయాయి. భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.