
హైదరాబాద్, వెలుగు: తమ డీలర్‌షిప్‌లకు లోన్ల వంటి ఆర్థిక సేవలు అందించడానికి మారుతి సుజుకి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా, మారుతి సుజుకి డీలర్‌లు తమ ఇన్వెంటరీ (వాహనాల స్టాక్) అవసరాల కోసం, కార్యకలాపాల విస్తరణ కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి ఫైనాన్సింగ్ సౌకర్యాలను పొందగలుగుతారు.
ఈ సహకారం మారుతి సుజుకి డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఇది డీలర్‌లకు సరైన సమయంలో, తగినంత ఫైనాన్సింగ్ అందుబాటులో ఉంచుతుంది.
వారి వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి, కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఒప్పందం తమ విక్రయాల వృద్ధికి కూడా తోడ్పడుతుందని మారుతి సుజుకి తెలిపింది.