Allu Arjun: ఢిల్లీ పేలుడుపై అల్లు అర్జున్ సంతాపం.. షాకింగ్‌గా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్!

Allu Arjun: ఢిల్లీ పేలుడుపై అల్లు అర్జున్ సంతాపం.. షాకింగ్‌గా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్!

ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట క్రాసింగ్ సమీపంలో జరిగిన బారీ పేలుడు దేశవ్యాప్తంగా విషాదం నింపింది.  ట్రాఫిక్ సిగ్రల్ వద్ద కదులుతున్న వాహనం బ్లాస్ట్ అవ్వడంతో ఈ  ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఈ పేలుడుతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుంటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తూ ధైర్యం చెబుతోంది.  ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ., సంతాప తెలిపారు.

 సినీ తారల తీవ్ర దిగ్భ్రాంతి

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ విషాద ఘటన విని చాలా బాధపడ్డాను అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ప్రార్థనలు. ఆ ప్రాంతంలో శాంతి తిరిగి నెలకొనాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.

 

అలాగే, దళపతి విజయ్ కూడా ఈ సంఘటనపై త్రీవంగా స్పందించారు. ఢిల్లీ ఎర్రకోట మెట్రో సమీపంలో జరిగిన కారు పేలుడు వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు లోనయ్యాను. ఇది విలువైన ప్రాణాలను బలిగొంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

 

కేంద్ర హోం మంత్రి రియాక్షన్..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణనష్టం జరగడం మాటల్లో చెప్పలేనంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిశాను. వారు త్వరగా కోలుకోవాలని  ప్రార్థించారు.  పూర్తి స్థాయిలో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి, ఈ ఘటన గురించి లోతుగా పరిశోధించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

 

కేసు నమోదు, కీలక ఆధారాలు
ఢిల్లీ పోలీసులు ఈ పేలుడుకు సంబంధించి పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం (Explosives Act), భారతీయ న్యాయ సంహితలోని (BNS) పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. UAPA కింద కేసు నమోదు చేయడం ద్వారా, ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

అటు అనుమానితుడి కారు పార్కింగ్ ప్రాంతంలోకి ప్రవేశించడం, బయటికి వెళ్లడం చూపించే CCTV ఫుటేజ్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజ్, దర్యాప్తులో కీలకమైన ఆధారంగా మారే అవకాశం ఉంది. పేలుడుకు గురైన వాహనం చుట్టూ ఉన్న అనేక ఇతర వాహనాలు కూడా మంటల్లో చిక్కుకుని దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, వ్యక్తుల గురించి పోలీసులు ముమ్మరంగా ధర్యాప్తు చేస్తున్నారు.