
దుబాయ్: టోర్నీ ఏదైనా.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్ టిక్కెట్ల కోసం ఎగబడతారు. విడుదల చేసిన నిమిషాల్లో టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఇండో–పాక్ మ్యాచ్ టిక్కెట్లు కూడా అలాగే అమ్ముడుపోయాయి. అయితే ఫ్యాన్స్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ మరో 4 వేల స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను గురువారం విడుదల చేసింది.
30 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేయొచ్చని ఐసీసీ తెలిపింది. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. ‘అక్టోబర్ 23న ఇండో–పాక్ మ్యాచ్ టిక్కెట్ల కోసం చాలా డిమాండ్ ఉంది. ఫిబ్రవరిలో సాధారణ టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన ఐదు నిమిషాల్లోనే మొత్తం ఖాళీ అయ్యాయి.
దీంతో ఎక్కువ మంది మ్యాచ్ చూసేందుకు వీలుగా స్టాండింగ్ టిక్కెట్లను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాం’ అని ఐసీసీ వెల్లడించింది. నవంబర్ 13న ఎంసీజీలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.