డాట్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒత్తిడి పెంచలేకపోయాం.. ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో ఈ తప్పులు చేయం: స్మృతి మంధాన

డాట్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒత్తిడి పెంచలేకపోయాం.. ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో ఈ తప్పులు చేయం: స్మృతి మంధాన

టాంటన్ (యూకే): ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోవడానికి తగినన్ని డాట్ బాల్స్ వేయకపోవడమే కారణమని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. రాబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను ఇంగ్లాండ్ 2–1తో కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భారత్ మొదట 35 పరుగులకే 3 వికెట్లు పడగొట్టినా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆలిస్ క్యాప్సే (82), హీథర్ నైట్ (70 నాటౌట్) 137 పరుగుల భాగస్వామ్యంతో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈ ఓటమి ఎదురైనప్పటికీ కెప్టెన్ హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ (56) తిరిగి ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడం సానుకూలాంశమని ఆమె చెప్పింది. 

జూన్ 14న బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్ ద్వారా భారత్ ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అయితే ఇండో-పాక్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అనే కాకుండా, ప్రపంచకప్‌‌‌‌‌‌‌‌ మొత్తాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మంధాన పేర్కొంది.