72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి (Mammootty)..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో మూవీ మే23న థియేటర్లో రిలీజై మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు.మమ్ముట్టి తన బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
టర్బో బాక్సాఫీస్
ఈ సినిమా కేవలం తమిళ థియేటర్లలో రిలీజైన కూడా కేరళ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ రూ.10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.తొలిరోజు టర్బో మూవీకి 6.25 కోట్ల కలెక్షన్స్ రాగా..రెండో రోజు రూ.3.75 కోట్ల వసూళ్లను మాత్రమే ఈ మూవీ రాబట్టింది.ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా యాక్షన్ మూవీలో ప్రతి ఎలిమెంట్ అన్నిరకాల ఆడియాన్స్ కు తెగ నచ్చేసింది.ఇక ప్రస్తుతం ఈ సినిమాకి వీకెండ్ తోడవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ వస్తోంది.
టర్బో ఓటీటీ రైట్స్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం మమ్ముట్టి సినిమాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో..టర్బో ఓటీటీ హక్కులు దాదాపు రూ.25 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, ఈ సినిమాను చాలా త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకు జూన్ 28 లేదా జూలై 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యేలా మాట్లాడుకున్నట్టు మళయాళ సినీ సర్కిల్ లో టాక్ షురూ అయింది.
అయితే,ప్రస్తుతం ఈ సినిమా కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే థియేటర్లోకి అందుబాటులోకి రాగా..ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.