
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. కెంట్ కౌంటీ గ్రౌండ్‌లో చాలా రిలాక్స్డ్గా ట్రెయినింగ్‌లో పాల్గొంది. గంట బస్ ప్రయాణం తర్వాత బెకెన్‌హామ్ చేరిన ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో వివిధ రకాల సంగీతం, హనుమాన్ చాలీసా, ఇంగ్లిష్ పాప్, ప్రసిద్ధ పంజాబీ పాటలతో సేద తీరారు. పై నుంచి రిషబ్ పంత్, బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌ను చూస్తూ మీడియాతో ముచ్చటించారు.
వామప్‌లో భాగంగా వీరిద్దరు కొద్దిసేపు జిమ్‌లో గడిపారు. వేలి గాయంతో ఇబ్బందిపడుతున్న పంత్ ఈ మ్యాచ్ వరకు ఫిట్‌నెస్ సాధిస్తాడని భావిస్తున్నారు. ఇక బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌కు దూరంగా ఉన్నారు. కేఎల్ రాహుల్ మినహా మిగతా ప్లేయర్లందరూ బెకెన్‌హామ్ వచ్చారు. నెట్స్‌లో సుదర్శన్ కొట్టిన బాల్‌ను ఆపే ప్రయత్నంలో అర్ష్‌దీప్ ఎడమ చేతికి గాయమైంది. అయితే అది ఎంత తీవ్రమైందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అర్ష్‌దీప్ వెళ్లిపోవడంతో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌కు దిగాడు. ఆర్చర్‌లాగా ఫుల్ పేస్‌తో బాల్స్ వేయడంతో బ్యాటర్లు బాగా ప్రాక్టీస్ చేశారు. తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లతో ఈ సెషన్‌ను ముగించారు.