ఇండియాతో టీ20లకు వార్నర్‌‌‌‌ దూరం

ఇండియాతో టీ20లకు వార్నర్‌‌‌‌ దూరం

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: ఇండియాతో గురువారం నుంచి రిగే ఐదు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీమ్‌‌‌‌లో ఒక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో 535 రన్స్‌‌‌‌తో ఆసీస్​ టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచిన స్టార్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ ఈ సిరీస్‌‌కు దూరం అయ్యాడు. అతని ప్లేస్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ ఆరోన్‌‌‌‌ హ్యార్డీని తీసుకున్నారు. నెల రోజుల కిందట ప్రకటించిన టీమ్‌‌‌‌లో వార్నర్‌‌‌‌కు చోటు కల్పించినా.. బిజీ షెడ్యూల్‌‌‌‌ వల్ల అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక ఈ ఏడాది టెస్ట్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పి కేవలం షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో కొనసాగుతానని  వార్నర్‌‌‌‌ గతంలో ప్రకటించాడు. వన్డే వరల్డ్ కప్‌‌ నెగ్గిన నేపథ్యంలో తన వరల్డ్ కప్‌‌ ముగిసిందని వస్తున్న వార్తలపై స్పందించాడు.  ‘నా పనైపోయిందని  ఎవరు చెప్పారు? అని ట్వీట్ చేశాడు. 

ఆస్ట్రేలియా టీ20 టీమ్‌‌‌‌: మాథ్యూ వేడ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), ఆరోన్‌‌‌‌ హ్యార్డీ, జేసన్‌‌‌‌ బెరెండార్ఫ్‌‌‌‌, సీన్‌‌‌‌ అబాట్‌‌‌‌, టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌, నేథన్‌‌‌‌ ఎల్లిస్‌‌‌‌, ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌, జోష్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, తన్వీర్‌‌‌‌ సంగా, మ్యాట్‌‌‌‌ షార్ట్‌‌‌‌, స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌, కేన్‌‌‌‌ రిచర్డ్‌‌‌‌సన్‌‌‌‌, జంపా.