వాల్తేరు విరాట్.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటయ్

వాల్తేరు విరాట్.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటయ్

సంక్రాంతికి రిలీజ్ కానున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఇటీవల మంచి టాక్ తెచ్చుకుంది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ను ఇప్పటి వరకు 14 మిలియన్ల మంది చూశారు.  ట్రైలర్ లో చిరంజీవి, రవితేజ యాక్షన్ సీన్స్, డైలాగులు ఆకట్టుకున్నాయి.  ముఖ్యంగా  రికార్డ్స్ లో  నా పేరు ఉండటం కాదు... నా పేరుమీదే రికార్డులు ఉంటాయి అని చిరంజీవి చెప్పిన డైలాగ్ అభిమానులు  విజిల్స్ వేసేలా ఉంది. అయితే ఇదే డైలాగ్ ఇపుడు విరాట్ కోహ్లీకి అన్వయించడంతో వైరల్ అవుతోంది.

ఈ నెల 10 నుంచి శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఉంది. దీంతో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఎంట్రీపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు వెరైటీగా ట్వీట్ చేసింది. వాల్తేరు వీరయ్యలోని డైలాగ్ ను  విరాట్ కోహ్లీకి అన్వయించింది. ‘‘రికార్డ్ లో నా పేరు ఉండటం కాదు..నా పేరు మీదే  రికార్డ్స్ ఉంటయ్. కింగ్ కోహ్లీ బ్యాక్ ఇన్ యాక్షన్’’ అని ట్వీట్ చేసింది. సినిమాలో చిరంజీవి ఫోటో ప్లేస్ లో కోహ్లీ ఫోటోన్ మార్పింగ్ చేసి పోస్ట్ చేసింది. ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఖుషీ అవుతున్నారు.