IPL 2024: ఇదెక్కడి విచిత్రం: ఐపీఎల్ ప్రైజ్ మనీని మించిపోయిన ఆసీస్ ఆటగాళ్లు

 IPL 2024: ఇదెక్కడి విచిత్రం: ఐపీఎల్ ప్రైజ్ మనీని మించిపోయిన ఆసీస్ ఆటగాళ్లు

ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ప్లేయర్లు 20 కోట్లకు పైగా అమ్ముడుపోయారు. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కావడం విశేషం. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మీద  ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించారు. ఊహకు అందని విధంగా వీరిద్దరూ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. వీరి ఇద్దరి ధర ఏకంగా ఐపీఎల్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఐపీఎల్ కు పేరుంది. ఆటగాళ్లపై కోట్లు కురిపించే ఐపీఎల్ ప్రైజ్ మనీ అన్ని లీగ్ ల కన్నా ఎక్కువ. గెలిచిన జట్టుకు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు వస్తుంది. అయితే మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ ఐపీఎల్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువగా ఉండడటం విశేషం. స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరో పేసర్ కమిన్స్ ను 20.50 కోట్లకు సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఇది తెలుసుకున్న క్రికెట్ ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 2 కోట్లతో బరిలోకి దిగిన స్టార్క్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. కమిన్స్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. రూ. 2 కోట్లతో బరిలోకి దిగిన స్టార్క్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య తీవ్ర పోటీ జరిగింది.చివరికి రూ. 24.75  కోట్లకు దక్కించుకుంది. దీంతో ప్యాట్‌ కమిన్స్‌ రూ. 20.5 కోట్ల రికార్డును స్టార్క్‌ అధిగమించాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by viralgully (@viralgully)