స్కూల్లో చేసిన ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌తోనే బిజినెస్ స్టార్ట్

స్కూల్లో చేసిన ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌తోనే బిజినెస్ స్టార్ట్

గోడకు మేకులు కొట్టకుండానే ఫొటోలు నిలబెట్టొచ్చు. టీవీని హ్యాంగ్ చేయొచ్చు. ఎంతటి బరువైనా సరే ఈజీగా గోడకు వేలాడదీయడం సాధ్యమంటున్నాడు దుబాయ్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న ఇండియన్ టీనేజర్ ‘ఇషిర్ వాద్వా’. చెప్పడమే కాదు తన స్కూల్ ప్రాజెక్ట్ ద్వారా చేసి చూపించాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌నే తన ఫ్యామిలీ బిజినెస్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఇషిర్ వాద్వా.. దుబాయ్‌‌‌‌‌‌‌‌లో టెన్త్​ క్లాస్ చదువుతున్న ఇండియన్ టీనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గోడకు మేకులు కొట్టకుండానే బరువులు వేలాడదీయొచ్చనే ఓ కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. జెమ్స్ వరల్డ్ అకాడమీలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఇషిర్.. ఐబి కోర్సులో భాగంగా ఈ స్కూల్ ప్రాజెక్ట్ చేశాడు. బెస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన ప్రొడక్ట్ ను కూడా రెడీ చేయబోతున్నాడు.

క్లాపిట్ తో హ్యాంగింగ్

క్లాపిట్ ద్వారా గోడపై దేన్నయినా హ్యాంగ్ చేయొచ్చు. ముందుగా స్టీల్ టేపులను గోడకు అతికించాలి. ఆ తరువాత నియోడిమియమ్ మ్యాగ్నెట్​ను వాడి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు. ఈ సిస్టమ్​కు క్లాపిట్ అని పేరుపెట్టాడు. ‘ఈ క్లాపిట్ ద్వారా ఎంత బరువునైనా వేలాడదీయొచ్చు. ఇదే విషయన్ని నా స్కూల్​లో ప్రాజెక్ట్ ద్వారా చేసి చూపించాను’ అని చెప్పాడు ఇషిర్. తన ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీని కూడా మేకుల అవసరం లేకుండా హ్యాంగ్ చేసి నిరూపించాడు.

కొడుకు దారిలో తండ్రి

సాధారణంగా తండ్రి డెవలప్ చేసిన బిజినెస్ ను ఆ తరువాత కొడుకు చూసుకుంటాడు. కాని తన కొడుకుపై ఉన్న నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి దిగాడు ఇషిర్ తండ్రి సుమేశ్. ఎక్కువ జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ‘క్లాపిట్’నే ఇప్పుడు తన ఫ్యామిలీ బిజినెస్‌‌‌‌‌‌‌‌గా మార్చుకున్నాడు.

త్వరలో ప్రపంచ మార్కెట్లోకి ప్రొడక్ట్

ఇంజినీరింగ్ చదువుతున్న తన అన్న, తండ్రి సాయంతో దీనికి సంబంధించిన ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ను తయారుచేయడానికి సిద్దమయ్యాడు ఇషిర్. మొదట దీన్ని దుబాయ్‌‌‌‌‌‌‌‌లో లాంచ్ చేసినా ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని చెబుతున్నాడు.