ఆసియా కప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ లు అర గంట ఆలస్యంగా..

ఆసియా కప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ లు అర గంట ఆలస్యంగా..

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ) ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం తీవ్రమైన వేడిని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సమయాలను మార్చినట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శనివారం ప్రకటించింది. మొత్తం 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో18 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. ఇండియా టైమ్ ప్రకారం మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు రాత్రి 7.30 గంటల నుంచి జరగాల్సి ఉండగా.  సవరించిన షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి. 

ఈ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి వేదికల్లో జరగనుంది. అయితే, సెప్టెంబర్ 15న  యూఏఈ– ఒమన్ మధ్య జరిగే ఒక మ్యాచ్ మాత్రం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో బరిలో నిలిచిన ఇండియా సెప్టెంబర్ 10, 14, 19వ తేదీల్లో వరుసగా యూఏఈ, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, ఒమన్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.