వారంలోగా టిమ్స్ ను ప్రారంభించండి: ఈటల

వారంలోగా టిమ్స్ ను ప్రారంభించండి: ఈటల
  • ప్రొఫెసర్‌‌‌‌ విమలను ఇన్‌‌‌‌చార్జిగా నియమించండి
  •  సిబ్బందిని 50% విభజించి వారానికో గ్రూప్‌కు డ్యూటీ వేయండి
  •  అధికారులకు ఈటల ఆదేశం

వారంలోగా గచ్చిబౌలి హాస్పి టల్‌‌‌‌(టిమ్స్‌‌‌‌)ను ప్రారంభించాలని, దానికి ప్రొఫెసర్ విమలా థామస్‌ను ఇన్‌‌‌‌ చార్జి గా నియమించాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్‌ ‌‌‌ఆదేశించారు. అందులోని సిబ్బందిని 50 శాతం విభజించి వారానికో గ్రూప్‌ ‌‌‌పనిచేలా ప్లాన్‌‌‌‌ చేయాలన్నారు. లక్షణాలున్న వాళకు, పాజిటివ్ వచ్చిన కాంటాక్ట్ వ్యక్తులకే పరీక్షలు చేయాలని చెప్పారు. హైదరాబాద్‌ ‌‌‌వెంగల్‌‌‌‌రావు నగర్‌‌‌‌లోని ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న ల్యాబ్‌‌‌‌లలో ఇప్పటివరకు రోజుకు 2,290 టెస్టులు చేసే కెపాసిటీ ఉండగా మరో వారంలో 4,310 పరీక్షల సామర్థ్యం పెంచుకొని రోజుకు 6,600 పరీక్షలు చేస్తామన్నారు. మరింత పక్కాగా 104 ,108 కాల్ సెంటర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్స్ ‌‌‌లో బెడ్ లేక ఇబ్బంది పడితే, కరోనా విషయంలో ఇబ్బంది వస్తే 104కి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. కొందరు నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నరు కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, కానీ కొందరు నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఈటల విమర్శించారు. రాజకీయాల కోసం హాస్పిటల్స్ ‌‌‌ముందు ధర్నాలు, ఆందోళన చేయడం సిగ్గుచేటన్నారు. ‘దీపాలు వెలిగించండి.. చప్పట్లు కొట్టండి అంటూ మాటలకే పరిమితం అవుతున్నా రు. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటివరకు రూ. 214 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకున్నారు’ అని కేంద్రంపై మండిపడ్డారు . టెస్టులు తక్కువ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, ముందు వాళ్ల సర్కారు చేసిన ఘనకార్యం తెలుసుకోవాలన్నారు. రోజుకు 3,500 నుంచి 4, 000 పరీక్షలు చేసే కెపాసిటీ ఉన్న రోస్ కంపెనీకి చెందిన కోబొస్ 8800 మెషీన్లను దేశంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ చేస్తే ఇండియాకు వచ్చిన ఆ మెషీన్‌‌‌‌ను డైవర్ట్ చేసి కోల్‌‌‌‌కతాకు పంపారని కేంద్ర వైఖరిని తప్పుబట్టారు .